మెరిసిపోతున్న ప్రియాంక ఇల్లు…

ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ పెళ్లి డిసెంబర్ 2న రాజస్థాన్ లోని జోధ్ అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. జోధ్ ఉమాయిద్ భవన్ ప్యాలెస్ ఘనంగా జరగనుంది. దాని కంటే ముందు మెహ్రంగర్ ఫోర్ట్ మెహందీ, సంగీత్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఢిల్లీ, ముంబైలో ప్రియాంక, నిక్ రిసెప్షన్ ఉంటుందట. గత ఆగస్టులోనే ఈ జంట నిశ్చితార్థం జరిగింది.

డిసెంబర్ 2 న పెళ్లి జరగనున్న నేపథ్యంలో.. ముంబైలోని జుహూలో ఉన్న ప్రియాంక ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రియాంక ఇంటిని లైట్లతో డెకరేట్ చేశారు. ఇటీవలే పెండింగ్ ఉన్న తన షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంక.. తన కాబోయే శ్రీవారు నిక్ జొనాస్ కలిసి ముంబై చెక్కేసింది. ఇక.. వాళ్లు తమ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వీళ్లు ఢిల్లీ నుంచి ముంబై వస్తూ ముంబైలోని కలినా ఎయిర్ పాపరజ్జీ కంట పడ్డారు. దీంతో కాబోయే జంటను వాళ్లు తమ కెమెరాల్లో బంధించారు.

Share This Post
0 0

Leave a Reply