మెట్రో కారిడార్‌-2 నేడు ప్రారంభం

హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా నిలిచిన మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్‌ను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌ పక్కనే నిర్మించిన మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలుకు సీఎం సాయంత్రం 4 గంటలకు పచ్చజెండా ఊపనున్నారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. జేబీఎ్‌స-పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మొదలుకొని సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌-కోఠి, ఎంజీబీఎస్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రారంభం తర్వాత మెట్రో రైలులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, తలసాని, మల్లారెడ్డి, మెట్రో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంజీబీఎస్‌ మెట్రో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ వరకు ప్రయాణిస్తారు. 2017 నవంబర్‌ 29న హైదరాబాద్‌ మహానగరంలో తొలిసారి మెట్రో సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. తర్వాత దశల వారీగా అమీర్‌పేట-ఎల్బీనగర్‌, అమీర్‌పేట-హైటెక్‌ సిటీ, హైటెక్‌ సిటీ-రాయదుర్గం మార్గాల్లో మూడుసార్లు మెట్రో సేవలను నాటి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

Share This Post
0 0

Leave a Reply