మెజారిటీ దిశగా యూపీఏ… బీజేపీ నుంచి చేజారిపోయిన ఝార్ఖండ్!

ఝార్ఖండ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని యూపీఏ కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించే దిశగా దూసుకెళుతోంది. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 30 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. 2014లో బీజేపీ 37 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో యూపీఏ కూటమి ఇప్పటికే 41 స్థానాల్లో (జేఎంఎం 23, కాంగ్రెస్ 14, ఆర్జేడీ 4) ఆధిక్యంలో దూసుకెళుతోంది. దీంతో దాదాపుగా ఝార్ఖండ్ రాష్ట్రం దాదాపుగా బీజేపీ చేజారినట్టేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుది ఫలితాలు మరో రెండు గంటల వ్యవధిలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Share This Post
0 0

Leave a Reply