మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు సెలబ్రిటీలను నామినేట్ చేసిన పీవీ సింధు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ప్రముఖులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. తమవంతుగా మొక్కలు నాటుతూ సమాజ హితానికి తాము సైతం అంటూ ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా, గ్రీన్ చాలెంజ్ లో భాగంగా భారత బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధు పుల్లెల గోపీచంద్ అకాడమీలో మూడు మొక్కలు నాటింది.

అంతేకాకుండా, చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గుర్ని నామినేట్ చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టెన్నిస్ తార సానియా మీర్జాలకు చాలెంజ్ విసిరింది. దీనిపై సింధు ట్విట్టర్ లో స్పందిస్తూ, గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ఆద్యుడైన ఎంపీ సంతోష్ గారిని అభినందిస్తున్నానని తెలిపింది. ఈ మంచి పనిలో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

Share This Post
0 0

Leave a Reply