‘మా ఎమ్మెల్యేలను కొనాలంటే మీ తాతలు దిగిరావాలి..!’

ఆమాద్మీ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌‌లో ఉన్నారంటూ కేంద్రమంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. తమ ఎమ్మెల్యేలను కొనడం అంత సులభం కాదంటూ కౌంటర్ విసిరారు. గోయల్ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఇవాళ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘మరి ఇంకెందుకు అక్కడే ఆగిపోయారు? మీరు ఎంత ఇస్తామన్నారు? వాళ్లు ఎంత అడుగుతున్నారు?’’ అని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘మోదీజీ… ప్రతిపక్ష పార్టీల పాలన కింద ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేస్తారా? మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మరి ఇంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి మీరు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మా ఎమ్మెల్యేలను కొనడానికి మీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఆప్ నాయకులను కొనడం అంత సులభం కాదు..’’ అని మరో ట్వీట్‌లో కేజ్రీవాల్ దుయ్యబట్టారు.

Share This Post
0 0

Leave a Reply