మహేశ్ బాబుకి అమ్మగా రమ్యకృష్ణ .. అత్తగా విజయశాంతి?

మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని .. మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది? రమ్యకృష్ణ పాత్ర ఏమిటి? అనే ఆత్రుత అందరిలోను మొదలైంది.

ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ .. అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయట. అందువల్లనే ఇంతటి క్రేజ్ వున్న సీనియర్ హీరోయిన్స్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Share This Post
0 0

Leave a Reply