మనం తీసుకువచ్చిన పాలసీ దేశానికి రోల్ మోడల్: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇసుక పాలసీపై అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఇసుక మైనింగ్ లో అక్రమాలకు తావులేని విధానం అమలు చేస్తున్నామని, తాము తీసుకువచ్చిన ఇసుక విధానం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. పాలసీ అమలు విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదని అన్నారు. చిన్న అవినీతి చోటుచేసుకున్నా మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. అక్రమాలు జరగకుండా చూడాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Share This Post
0 0

Leave a Reply