మధ్యాహ్న భోజనానికి రూ. 326 కోట్లు ఖర్చు : మంత్రి సబిత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మధ్యాహ్న భోజనం అమలవుతోంది అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానం ఇచ్చారు. మధ్యాహ్న భోజనానికి రూ. 326 కోటర్లు ఖర్చు అవుతోందని ఆమె తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చును భరిస్తున్నాయని చెప్పారు. ఈ పథకంలో సన్న బియ్యానికి అదనపు ఖర్చు రాష్ర్టానిదే అని స్పష్టం చేశారు. 2015 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని గుర్తు చేశారు. 54,232 మంది వంటి సహాయకులు పని చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కరికి 100 గ్రాముల బియ్యం సరఫరా చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Share This Post
0 0

Leave a Reply