మంత్రి కేటీఆర్‌ ఔదార్యం

కర్ణాటకకు చెందిన ఓ బాలికకు నడవడానికి అవసరమైన పరికరాన్ని కొనుగోలుచేయడానికి ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన శిల్పారెడ్డి అనే బాలిక బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ కొనప్పన అగ్రహారంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. బాలిక వెన్నుముక సమస్యతో బాధపడుతుండగా, చికిత్స కోసం సినీహీరో మహేశ్‌బాబు సాయమందించారు. ఆమె నడవడానికి బెల్ట్‌ అవసరం ఉంటుంది. బెల్ట్‌ అమరిస్తే ఎవరి సహాయం లేకుండా నడవగలుగుతుంది. బెల్ట్‌కు రూ.1.10 లక్షలు అవసరం కాగా, ఇందుకు బాధితురాలు రూ.20 వేలు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని భరించడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో కర్ణాటక ముఖ్యమంత్రిని సాయమడిగింది. సీఎం నుంచి స్పందన రాకపోవడంతో ట్విట్టర్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆర్థిక సాయమందించాలని అభ్యర్థించింది.

Share This Post
0 0

Leave a Reply