మంత్రి కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌ని మరోసారి టార్గెట్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేసిన విమర్శలపై స్పందించారు. అలాగే జన్వాడలో ఫామ్‌హౌస్ గురించి మీడియా ముందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్‌హౌస్ కట్టారని.. ఆ పార్టీ విప్ బాల్క సుమన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ‘కేటీఆర్ నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారని .. సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం.. కుటుంబ సభ్యులతో ఉంటారని’ స్వయంగా సుమనే ఒప్పుకున్నారన్నారు.
మార్చి 5న ఈ సమస్యపై డ్రోన్ కెమెరా ఉపయోగించానని తనతో పాటూ 8మంది కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారని.. ఆ సందర్భంగా నా బెయిల్ సమయంలో మెజిస్ట్రేట్ ముందు పోలీసులు ఓ మెమో ఫైల్ చేశారని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తీరుతో కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబానికి.. ఆస్తులకు ప్రమాదం ఉందని.. బెయిల్ ఇవ్వొద్దన్నారని.. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే సుమన్, పోలీసులు ఆ ఫామ్‌హౌస్ కేటీఆర్‌దే అని ఒప్పుకున్నారన్నారు రేవంత్.

Share This Post
0 0

Leave a Reply