ఫేస్‌బుక్‌.. ఇక ప్రైవ‌సీబుక్ !

ఆన్‌లైన్ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌.. త్వ‌ర‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు లోనుకానున్న‌ది. ఫేస్‌బుక్ ద్వారా జ‌రిగే సంభాష‌ణ‌లు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాల‌ని ఆ సంస్థ ఆలోచిస్తున్న‌ది. ఫేస్‌బుక్ ఈసీవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఈ తాజా ఐడియాను త‌న బ్లాగ్‌లో పోస్టు చేశాడు. సుర‌క్షిత‌మైన‌ ప్రైవేటు మెసేజ్ స‌ర్వీసులు భ‌విష్య‌త్తులో మ‌రింత పాపుల‌ర్ అవుతాయ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ అంచ‌నా వేస్తున్నాడు. ఓపెన్ ఫ్లాట్‌ఫామ్‌ల క‌న్నా.. ప్రైవ‌సీ ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఫేస్‌బుక్‌కు చెందిన న్యూస్‌ఫీడ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గురించి కానీ జుక‌ర్‌బ‌ర్గ్ ఎటువంటి నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించ‌లేదు. భ‌విష్య‌త్తులో యూజ‌ర్లు ప్రైవ‌సీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల‌తో క‌మ్యూనికేట్ చేసుకుంటార‌ని తెలిపాడు. అందుకే ఎఫ్‌బీని ప్రైవ‌సీ ప్లాట్‌ఫామ్‌గా మార్చాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు.

Share This Post
0 0

Leave a Reply