ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్..

KCR

రెండోసారి తెలంగాణ పాలనాపగ్గాలు స్వీకరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రధాని నరేంద్రమోదీని లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ఆయన నివాసంలో సాయంత్రం నాలుగు గంటలకు మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్.. మోదీని కలిసి విభజన హామీలపై చర్చించనున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కోరనున్నారు.అలాగే షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్‌లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్‌వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రిజర్వేషన్ల పెంపు, తదితర అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణకు నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణశాఖ భూములు అప్పగించే అంశాలనూ ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని తెలిసింది.

 

TAGS : cm kcr , delhitooor , kcr meet pm modi , telangana ,

Share This Post
0 0

Leave a Reply