ఫిబ్రవరిలో యాదాద్రి ఆలయ ప్రారంభం

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తికావచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. చినజీయర్‌ స్వామి సంకల్పం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో మహా సుదర్శనయాగం చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ పీఠాలన్నింటి నుంచి స్వాములను పిలిపించాలని జీయర్‌స్వామిని వేడుకొన్నానని, దీనికి ఆయన ఒప్పుకొన్నారని తెలిపారు. తాను ఎక్కడకు వెళ్లినా అందరూ స్వామి వారి ప్రతిభ గురించి చెప్తున్నారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. తాను శ్రీరంగంలో స్వామి పేరుచెప్తే.. ‘మీ జీయర్‌ స్వామి’ అని వాళ్లు అన్నారని, అందుకు తాను.. ‘మీకు స్వామి కాదా?’ అని అంటే.. మాకు కూడా స్వామియేనని చెప్పారని వివరించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ గ్రామంలో చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరిగిన తిరునక్షత్రోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. సీఎం దంపతులకు చినజీయర్‌ స్వామి పట్టువస్ర్తాలు అందించి, ఆశీర్వదించారు.

Share This Post
0 0

Leave a Reply