ఫలించని ప్రయత్నాలు.. సుజిత్ కథ విషాదాంతం

పార్థనలు ఫలించలేదు, రెస్క్యూ ఆపరేషన్ కాపాడలేకపోయింది.. బోరు బావిలో పడ్డ చిన్నారి సుజిత్ చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు. నాలుగు రోజులకు పైగా బోరు బావిలోనే ఉన్న చిన్నారి శ్వాస ఆడక చనిపోయినట్టు నిర్ధారించారు. బాడీ డీ కంపోసింగ్ స్టేజిలో ఉంది. బోరు బావి నుండి వాసన వస్తోన్నట్టు స్పష్టం చేశారు. చిన్నారిని కాపాడేందుకు తాము ఎంతగానో శ్రమించినప్పటికీ.. దురదృష్టవశాత్తూ రక్షించుకోలేక పోయామంటూ బాలుడి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు అధికారులు. శనివారం నుండి ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌తో పాటు, డాక్టర్లు, మద్రాసు ఐఐటీ నిపుణులు కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఓవైపు పైపులతో ఆక్సిజన్‌ అందించారు. బాలుడు ఎంత లోతులో ఉన్నాడో గుర్తించి దానికి సమాంతరంగా గొయ్యి తవ్వడం మొదలెట్టారు. కానీ రోజులు గడవడం.. ఆక్సిజన్ సరిగా అందకపోవడం.. నీరు, ఆహారం లేకపోవడంతో సుజిత్ ప్రాణాలు విడిచాడు. సుజిత్ క్షేమంగా ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. కానీ చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయాం.

Share This Post
0 0

Leave a Reply