ప్రతి బొట్టూ ఒడిసిపట్టాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్‌డ్యాములు నిర్మించి ఎక్కడికక్కడ నీటిని ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని చెక్‌డ్యాంలు ఉన్నాయి? ఇంకా ఎన్ని నిర్మించాలి? అనేదానిపై లెక్కలు తీయాలని సూచించారు. ఎన్ని చెక్‌డ్యాములు అవసరమో గుర్తించి, వాటిలో సగం చెక్‌డ్యాములను ఈ ఏడాది, మిగతావాటిని వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పారు. మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ఏటా చేపట్టాలని సూచించారు.

చిన్ననీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ర్టానికి సాగునీటి సమస్య తీరుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో గోదావరి నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామని అన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే 500కు పైగా టీఎంసీల నీటిని వాడుకుంటామని స్పష్టంచేశారు. ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్‌మానేరు, ఎస్సారెస్పీతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌వంటి రిజర్వాయర్లు నింపి, అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తామని తెలిపారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుందని, పుష్కలమైన పంటలు పండుతాయని వివరించారు.

Share This Post
0 0

Leave a Reply