పేట్ బషీరాబాద్ లో కాల్పుల కలకలం

ak 47

నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. దేవరాంజల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్ మధ్య భూ వివాదం ఉంది. ఈ క్రమంలో నరసింహారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి వివాదంలో ఉన్న భూమిలో రాళ్లు పాతడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఆగ్రహం చెందిన వేణుగోపాల్ రెడ్డి తన దగ్గర ఉన్న గన్‌తో మహిపాల్ రెడ్డిపై కాల్పులు జరిపాడు. మహిపాల్ రెడ్డి తండ్రి నర్సింహరెడ్డి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు బాధితుడు మాత్రం ఇది కుటుంబ కలహాలని, తాను పిర్యాదు చేయలేదని చెప్పారు.

TAGS: pet bashir bagh , policestation , firing ,

 

Share This Post
0 0

Leave a Reply