పెళ్లి పీటలు ఎక్కబోతున్న సానియా మీర్జా చెల్లెలు.. పెళ్లికొడుకు ఎవరంటే?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ‘నేను కాబోయే వధువు’ అంటూ ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా ఆనం మీర్జా తెలిపారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనంద్ మీర్జా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారే ప్రచారం జోరుగా సాగింది.

ఈ నేపథ్యంలో తమ పెళ్లి జరగబోతున్నట్టు ఆమే స్వయంగా ప్రకటించింది. డిసెంబరులో ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం. ‘లబేల్ బజార్’ పేరిట ఆనం మీర్జా ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తోంది. అసద్ న్యాయవాదిగా ఉన్నారు.

Tags: Sania MirzaAnam Mirza

Share This Post
0 0

Leave a Reply