పెట్రోల్ తీసుకుని తాహశీల్దార్ ఆఫీస్‌కు వచ్చిన దంపతులు

స్థలం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ ఆళ్లగడ్డ తాహశీల్దార్ ఆఫీస్ వద్ద దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు పెట్రోల్, పురుగుల మందు డబ్బా తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పది సంవత్సరాల పాటు తాశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరుగలేదంటూ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. స్థానికులు వారిని అడ్డుకుని వారించారు. సుబ్బారెడ్డికి జాతీయ రహదారి పక్కనే వేరువేరు సర్వే నెంబర్లతో 11 సెంట్ల స్థలం ఉంది. ఈ రెండు స్థాలల్లో ఒకటి హైవే విస్తరణలో పోయింది. స్థలానికి ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. ఇంకో సర్వే నెంబర్‌తో ఉన్న స్థలాన్ని మరో వ్యక్తి పన్ను చెల్లించి రెవెన్యూ రికార్డుల్లో తన పేరుతో నమోదు చేయించుకున్నారు. స్థలం విషయంలో తమకు న్యాయం చేయాలని దంపతులిద్దరూ తాహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తాహశీల్దార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురయిన సుబ్బారెడ్డి దంపతులు పురుగుల మందు, పెట్రోల్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందు తాహశీల్దార్ ఆఫీస్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని సుబ్బారెడ్డి దంపతులకు హామీ ఇచ్చారు.

ఇటీవల తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. తహసీల్దార్‌‌పై సురేష్ అనే రైతు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆపై తను కూడా పెట్రోల్‌ పోసుకుని సురేష్‌ నిప్పంటించుకున్నాడు. నిందితుడు సురేష్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి వాసి. ఈ నెల 4వ తేది మధ్యాహ్నం ఒంటి గంటకు తహసీల్దార్‌ కార్యాలయంలోకి సురేష్‌ వచ్చాడు. అరగంట పాటు తహసీల్దార్‌ విజయతో మాట్లాడాడు. 1.30 గంటలకు తహసీల్దార్‌ గదిలో నుంచి సురేష్ బయటికి పరుగులు తీశాడు. కాసేపటికే మంటలతో తహసీల్దార్‌ విజయారెడ్డి బయటికి వచ్చారు. మంటలార్పడానికి యత్నించిన ముగ్గురికి గాయాలయ్యాయి. సురేష్‌ కూడా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.

Share This Post
0 0

Leave a Reply