పీవీ సింధుకు బీఎండబ్ల్యూ కారు..

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని పీవీ సింధు సువర్ణాక్షరాలతో లిఖించిన సంగతి తెలిసిందే. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో బాసెల్‌ (స్విట్జర్లాండ్)‌ అలవోకగా గెలిచిన సింధు.. ఈ టోర్నీలో స్వర్ణం పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు అభినందించారు. ఈ ప్రముఖుల్లో కొందరు సింధుకు భారీ నజరానాలు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. స్వర్ణం పతకం సాధించిన సింధుకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ (BMW) కారును బహుకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం జరగనుంది. కాగా.. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కారు బహుకరణ అనంతరం కార్యక్రమంలో సింధు, చాముండేశ్వరీ నాథ్, నాగ్ కూడా ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

Share This Post
0 0

Leave a Reply