పిల్లల్ని స్మార్ట్‌ఫోన్లకు దూరం ఉంచండిలా..

పిల్లలు సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. వాళ్లు అల్లరి చేసినా, ఏడ్చినా పెద్ద వాళ్లు ఫోన్ ఇచ్చి వారి పనులు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా దుష్ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు.

పిల్లలను స్మార్ట్ ఫోన్ నుంచి దూరం చేయడం చాలా కష్టమైన పనే. కానీ తల్లిదండ్రులు మెల్లిగా వారి దృష్టిని మరల్చాలి. పిల్లల ముందు ఎవ్వరూ ఫోన్ వాడకపోవడం మంచిది.
-పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి సరికొత్త బొమ్మలు వచ్చాయి. బిల్డింగ్ బ్లాక్స్ టాయ్స్ వచ్చాయి. వాటితో బిల్డింగ్స్ తయారు చేయించాలి. వివిధ రంగుల్లో ఉండే ఈ బ్రిక్స్ చిన్నారులను ఆకట్టుకుంటాయి.
-చదువుతో కూడిన ఆటలు కొన్ని ఉంటాయి. వీటితో పిల్లల్ని ఆడించడం వల్ల ఆడించినట్లేకాక చదువు నేర్పినట్లూ ఉంటుంది. పిల్లలను పార్కుకు తీసుకెళ్లాలి. వారితో కలిసి ఆటలు ఆడడం వల్ల సెల్‌ఫోన్, వీడియో గేమ్‌లపై పిల్లలు ఎక్కువగా దృష్టి సారించరు.
-సెల్‌ఫోన్‌లో కొత్త యాప్స్ ఉంటే డిలీట్ చేయాలి. గేమ్స్‌యాప్‌లను కూడా సెల్‌ఫోన్‌లోంచి తొలగించాలి. కథలు చెప్పడం వల్ల వారిలో మంచిని పెంచిన వారమవుతాం. వీలైనంత వరకు సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ఉండాలి.
-పిల్లల ముందు స్మార్ట్‌ఫోన్ వాడకూడదు. ఫోన్ కేవలం అవసరానికి మాత్రమే అన్న విషయాన్ని అప్పుడప్పుడూ గుర్తు చేస్తూ ఉండాలి.

Share This Post
0 0

Leave a Reply