పిల్లలకు శాపం ఐరన్‌ లోపం

దేశంలో ఐరన్‌లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. కేరళ మినహా మిగిలిన అన్నిరాష్ర్టాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తున్నది. జాతీయ పౌష్టికాహార సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో.. ఆయారాష్ర్టాల్లో పిల్లల్లో ఐరన్‌ లోపం ఎంతశాతం విస్తరించిందో వివరించింది. 19 ఏండ్లలోపు వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తేల్చింది. పిల్లల వయస్సునుబట్టి మూడు గ్రూపులుగా విభజించి సర్వే నిర్వహించిన సంస్థ.. ఏయే రాష్ట్రంలో ఎంతమేరకు ఈ సమస్య ఉన్నదనేది గణాంకాలతో తేల్చి చెప్పింది. 5 నుంచి 9 ఏండ్ల మధ్య వయసు గల వారు కేరళ మినహా మిగతా అన్నిరాష్ర్టాల్లో ఈ లోపంతో బాధపడుతున్నారు.

ఐరన్‌ లోపంతో బాధపడుతున్నవారిలో ఐదేండ్ల లోపు వయసు కలిగిన పిల్లలు 27 రాష్ర్టాల్లో ఉన్నారు. 9 నుంచి 19 ఏండ్ల మధ్య వయసు పిల్లలు 15 రాష్ర్టాల్లో ఉన్నారు. 1 నుంచి 4 ఏండ్ల్లలోపు పిల్లల్లో ఐరన్‌ లోపం ఉన్నవారి దేశ సగటు 31.9 శాతం ఉండగా.. తెలంగాణలో 33.4 శాతం ఉన్నది. తెలంగాణ కంటే 14 రాష్ట్రాల సగటు అధికంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏండ్లమధ్య వయస్సు చిన్నారులు 17.0 శాతం, 10 నుంచి 19 ఏండ్ల మధ్యవారు 21.5 శాతం మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు.

Share This Post
0 0

Leave a Reply