పశ్చిమగోదావరి జిల్లాలో కరెంట్ తీగపై పాము హల్ చల్

snake

పశ్చిమగోదావరి జిల్లాలో కరెంట్ తీగపై పాము హల్ చల్ చేసింది, తణుకు శివారు పైడిపర్రులోని ఈ ఘటన జరిగింది. పామును చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. సమీపంలోని కొబ్బరి చెట్ల నుంచి కరెంట్ తీగల మీదకు పాము వచ్చింది. అయితే ఎటు వెళ్లాలో తెలియక కొంతసేపు భయంతో బిగుసుకుపోయింది. సుమారు గంట సేపు తాచుపాము కరెంటు తీగలపైనే సంచరించింది. గ్రామస్థులు ఆ పామును కిందకు వచ్చేలా ఏర్పాట్లు చేయడంతో పాము కిందకు దిగి సమీపంలోని మడుగు ప్రాంతం వైపు వెళ్లిపోయింది.

 

TAGS: west godawari , snake , powewr wire , hal chal ,

Share This Post
0 0

Leave a Reply