పవన్ కల్యాణ్‌‌కు షాక్… బీజేపీలో చేరిన జనసేన నేత

జనసేన పార్టీలో నిన్నటి వరకు పనిచేసిన మహిళా నాయకురాలు జనసేనకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఓ మహిళా నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు పుట్టి లక్ష్మీసామ్రాజ్యం జనసేన కు షాక్ ఇచ్చి బిజెపిలో చేరి పోయారు. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలతో కలిసి లక్ష్మి సామ్రాజ్యం బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పార్టీ వీడిన వెంటనే లక్ష్మీ సామ్రాజ్యం జనసేన పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. జనసేన పార్టీలో నిజాయితీ పనిచేసేవారికి స్థానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ సామ్రాజ్యం.

జనసేన మహిళా నాయకురాలు లక్ష్మి సామ్రాజ్యం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాజ్యం గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను వీడి బిజెపిలో చేరిన ఆమె జనసేన పార్టీకి సంబంధించిన జరుగుతున్న పరిణామాలు నచ్చకనే పార్టీ మారుతున్నానని చెప్పారు. ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరిన కొందరు నేతలు జనసేన పార్టీని వదిలి వేరే పార్టీలో చేరిపోయారు. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ వంటి నేతలు జనసేన కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

Share This Post
0 0

Leave a Reply