పర్యాటక వైభవం: భాగ్యనగరం టు గిరిజన కుంభమేళా

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయిన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలలనుంచి గిరిజనులు తమ కొంగు బంగారాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. విగ్రహమే లేని వన దేవతల సన్నిధిలో గిరిజనులే కాకుండా నగరజనం కూడా భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. ప్రతి రెండేండ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి శుభఘడియల్లో జరిగే మహాజాతరకు లక్షలాదిగా భక్తులే కాకుండా పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. మేడారం వచ్చే చాలామంది భక్తులు చుట్టుపక్కల ఉన్న అరుదైన ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి మేడారం దారి ఉన్న ఆధ్యాత్మిక పర్యా టక విశేషాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం..

Share This Post
0 0

Leave a Reply