పని చేయని మైకులు, పవన్ అసహనం

అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న వేళ, ఊహించని పరిణామాలు జరగడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు పవన్. ఈ సభకు
భారీ ఎత్తున ప్రజలు తరలిరాగా, సభ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో స్థానిక నాయకత్వం విఫలమైంది. పవన్ వేదికపైకి రాగానే,
అభిమానులు, జనసేన కార్యకర్తల అరుపులు, కేకలతో సమావేశం గందరగోళమైంది. అభిమానులు సంయమనం పాటించాలని చేసిన విజ్ఞప్తులను ఎవరూ
వినలేదు. ఇదే సమయంలో మైకులు మొరాయించాయి.దీంతో పవన్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక దశలో తీవ్ర అసహనాన్ని
వ్యక్తం చేసిన పవన్, ఇటువంటి మైకులు ఉన్న చోట మాట్లాడటం కష్టం అంటూ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

 

TAGS: pawan kalyan, janasena party,pedhipalyam, roadshow

 

Share This Post
0 0

Leave a Reply