పదో తరగతి విద్యార్థులకు మంత్రి హరీశ్‌రావు బంపరాఫర్

పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ముందుండేలా కార్యాచరణ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు నిర్దేశించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల మహిళా హెచ్‌ఎంలకు గొల్లభామ చీరలు అందజేయడంతో పాటు సన్మానం చేస్తామని పేర్కొన్నారు. ఎంఈవోలను సత్కరిస్తామన్నారు. 10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులకు రూ.25 వేలు ప్రోత్సాహకం ఇస్తామన్నారు.

Share This Post
0 0

Leave a Reply