పంకలు లేని ఫ్యాన్లు..!

ప్రముఖ టెక్నాలజీ సంస్థ డొమెక్ సొల్యుషన్స్ కంపెనీ.. తెలుగు రాష్ర్టాల్లోకి రెక్కల రహిత (బ్లేడ్ లెస్) ఫ్యాన్లను విడుదల చేసింది. ఎక్స్‌హీల్ కంపెనీ తయారు చేసిన రెండు రకాల ఫ్యాన్లను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్నట్లు డొమెక్ ఎండీ రఘురామిరెడ్డి తెలిపారు. ఎలాంటి శబ్దం లేకుండా శుద్ధి చేసిన గాలిని ఇవ్వడం ఈ ఫ్యాన్ల ప్రత్యేకత. రెండు మోడళ్లలో విడుదల చేసిన ఈ ఫ్యాన్లలో ఒక్కటి రూ.23,500కి లభించనుండగా, మరొకటి రూ.25,600లకు వస్తుంది. వీటిని తయారు చేయడానికి చెన్నై సమీపంలో రూ.10 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేశా మని, నెలకు 14 వేల యూనిట్లు ఉత్పత్తవుతున్నాయన్నారు. వీటిలో సగం దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న సంస్థ.. మిగతావి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. సిలింగ్‌కు ఒక డిజైన్‌లా ఈ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ గదిలో ఉన్న గాలిని ఫ్యూరిఫై చేసి 360 డిగ్రీల వైశాల్యంలో విస్తరిం పజేస్తుంది.

Share This Post
0 0

Leave a Reply