నేడే పైడితల్లి సిరిమానోత్సవం..

ఇవాళే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.. ఈ ఉత్సవాన్ని వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరంలోని మూడులాంతర్ల దగ్గర పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి సిరిమాను రథం బయల్దేరనుంది. పాలధార, అంజలి రథం, అంబారి ఏనుగు, జాలరి వల రథానికి ముందు నడవనున్నాయి. మూడు లాంతర్ల నుంచి కోట వరకు సిరిమాను రథం మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ.. కోట దగ్గర ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయులను ఆశీర్వదించి తిరిగి మూడులాంతర్లకు చేరుకుంటుంది. 40 అడుగుల ఎత్తున్న సిరిమాను పీఠంపై ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారి ప్రతిరూపంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తారు. ఇక, సిరిమానోత్సవానికి చాలా ప్రత్యేక ఉంది.. ఈ ఉత్సవాన్ని చూసేందుకు స్థానికులే కాదు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఇక, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Share This Post
0 0

Leave a Reply