నెల్లూరు జిల్లాలో మళ్లీ మొదలైన బెట్టింగ్.. ఎందుకో తెలిస్తే

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏ చర్చలు సాగుతున్నాయి? ఆ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నది ఎవరు? పది మంది ప్రస్తుత ఎమ్మెల్యేల బలాబలాల సంగతేంటి? ఆ జిల్లాలో బెట్టింగ్‌ల జోరు మళ్లీ ఎందుకు పెరిగినట్టు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం.   ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాగా పట్టున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది ఆ పార్టీ. గెలుపొందిన ఎమ్మెల్యేల్లో కాకలుతీరిన రాజకీయ యోధులు, పార్టీకోసం అహర్నిశలు శ్రమించినవారు, మాజీమంత్రులు ఉన్నారు. అందువల్ల ఈ జిల్లాలో ఏడెనిమిది మంది నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయా నేతల అనుచరులు కూడా తమ నేతకి మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సింహపురిలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఇంతకీ మంత్రి పదవి ఆశిస్తున్న నేతల బలాబలాలు, అర్హతల సంగతేంటో ఒకసారి పరిశీలిద్దాం..

Share This Post
0 1

Leave a Reply