నితిన్ ‘భీష్మ’ టీజ‌ర్ విడుద‌ల‌

ల‌వ‌ర్ బోయ్ నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రోవైపు నితిన్.. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కాగా, నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Share This Post
0 0

Leave a Reply