నా ఆరోగ్యం ఇప్పుడు భేషుగ్గా ఉంది: హాస్య నటుడు సునీల్

తొలుత కమేడియన్ గా, ఆపై హీరోగా తనేంటో నిరూపించుకున్న సునీల్, ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, “నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ‘డిస్కో రాజా’ చూసి ఆనందించండి” అని పేర్కొన్నారు.

Share This Post
0 0

Leave a Reply