‘నారా దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా’

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై రగడ నడుస్తోంది. టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామంటే వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేశారని.. ఇప్పుడు మళ్లీ ఇంగ్లీష్ మీడియంను ఎందుకు తీసుకొచ్చారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ విధానంపై నానా యాగీ చేశారని.. ఇప్పుడు జగన్ సర్కార్ చేస్తుంది ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?’అంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయసాయి. ‘పది వేల లోపు డిపాజిట్ చేసి మోస పోయిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు సిఎం జగన్ గారు నిధులు పంపిణీ చేసి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మీకిది కనిపించట్లేదా చంద్రబాబు గారూ. కుక్కలను ఉసిగొల్పి మొరిగించే బదులు ఇలాంటి మంచి పనులను ప్రశంసిస్తే హుందాగా ఉంటుంది’అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Share This Post
0 0

Leave a Reply