నాని ‘జెర్సీ’ నుండి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌.

నేచుర‌ల్ స్టార్ నాని, మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ఆ మ‌ధ్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా అదేంటో గాని ఉన్న‌పాటుగా అనే పాట యొక్క లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతంలో రూపొందినఈ సాంగ్‌కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. అనిరుధ్ ఈ పాట ఆల‌పించారు. ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో చాలా శిక్షణ తీసుకున్నాడ‌ని అన్నారు . నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. త‌మిళంలోను ఈ చిత్రం విడుద‌ల‌కి మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా తాజాగా విడుద‌లైన సాంగ్‌ని త‌మిళంలోను విడుద‌ల చేశారు. మ‌ర‌క్క‌విల్లాయే అంటూ త‌మిళంలో సాగే ఈ పాట‌కి విఘ్నేష్ శివ‌న్ లిరిక్స్ అందించ‌డం విశేషం.

Tags: Natural star nani, Jersey, #NANI

Share This Post
0 0

Leave a Reply