నందమూరి సుహాసిని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారా?

trs

గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారా? చంద్రబాబుకు తానిస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ ఇదేనా? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం, అతి త్వరలోనే సుహాసిని కారెక్కబోతున్నారు. ఇక, తానెంతో అభిమానించే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన సుహాసినికి, రాజకీయ జీవితాన్ని అందించాలని భావిస్తున్న కేసీఆర్, ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్సీని చేయాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

TAGS:nandamuri suhasini , cm kcr , elections , prajakutami , suhasini ,

Share This Post
0 0

Leave a Reply