ధోనీ ఇక రిటైర్ కావాలని కోరుకుంటున్న తండ్రి, తల్లి!

టీమిండియా స్టార్ ప్లేయర్, వరల్డ్ టాప్ వికెట్ కీపర్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ రిటైర్ మెంట్ పై ఇటీవలి కాలంలో తెగ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లండన్ వరల్డ్ కప్ తరువాత ఆయన తన ఆటకు స్వస్తి చెబుతారని వార్తలు వచ్చినా, వాటిని ధోనీ కొట్టిపారేశాడు. జులై మూడు నుంచి జరిగే విండీస్ టూర్‌ కు ధోనీ ఎంపికవుతాడా? అన్నది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో ధోనీ తల్లిదండ్రులు మాత్రం, తమ కుమారుడు ఇక ఆటకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ధోనీ పర్సనల్ కోచ్ కేశ‌వ్ బెన‌ర్జీ స్వయంగా చెప్పారు. ధోనీ క్రికెట్‌ కు గుడ్‌బై చెప్పాల‌ని అయన త‌ల్లిదండ్రులు కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. తాను వారింటికి వెళ్లి మాట్లాడానని, ఇక క్రికెట్ ను విడిచి, తమతో పాటు ఇంట్లో ఉండాల‌ని వారు భావిస్తున్నారని అన్నారు. తాను మాత్రం మరో ఏడాది ఆడి, టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్ మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని వారికి సర్ది చెప్పానని అన్నారు. వారు మాత్రం వెంటనే తప్పుకోవాలనే భావిస్తున్నారని అన్నారు.

Tags: MS DhoniFatherKeshav Benerjee

Share This Post
0 0

Leave a Reply