దూసుకుపోతున్నాటీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ లు 604

trs

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి విడతలో 3,701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో 12, 202 మంది సర్పంచ్‌ అభ్యర్థులు నిలబడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ 604, కాంగ్రెస్ 34, సీపీఎం 6, సీపీఐ 2, బీజేపీ 2, టీడీపీ 2, ఇతరులు 106 స్థానాల్లో గెలుపొందారు.తొలి విడత ఎన్నికలు జరగబోయే 3,701 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వులకుగాను 12,202 మంది పోటీలో ఉండగా.. 28,976 వార్డు సభ్యుల పదవులకుగాను 70,097 మంది బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డులు సభ్యుల అభ్యర్థులకు, తర్వాత సర్పంచ్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తున్నారు.

 

TAGS: trs , panchayath elections, telangana , congress ,

Share This Post
0 0

Leave a Reply