దుర్గాదేవిగా కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు ఆదివారం కనకదుర్గమ్మ.. దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. సాయంత్రం 6 గంటల వరకు 2.80లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, ఆనవాయితీ ప్రకారం టీటీడీ తరఫున దుర్గమ్మకు టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పట్టువస్త్రాలతో సారె సమర్పించారు. ఆయనకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో ఎం.వి.సురే్‌షబాబు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న తరుణంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వైవీ పేర్కొన్నారు. సీఎం జగన్‌ తలపెట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు.

Share This Post
0 0

Leave a Reply