దర్శుకుడి కూతురుతో మహేష్ బాబు రొమాన్స్! ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్‌ని ఫైనల్ చేశారని సమాచారం. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌ని ఫిక్స్ చేశారని టాక్. సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ప్రీ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ప్రస్తుతం ఇతర నటీనటులు, హీరోయిన్ ఎంపికలో నిమగ్నమైన దర్శకనిర్మాతలు మహేష్ సరసన స్టార్ డైరెక్టర్ కూతురుని హీరోయిన్‌గా ఫైనల్ చేశారని తెలుస్తోంది.

Share This Post
0 0

Leave a Reply