తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

కాగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో నిన్న తెలుగు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, ఉప్పల్, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది.

Share This Post
0 0

Leave a Reply