తెలంగాణ లో వందల కోట్ల ఆస్తులున్న శ్రీమంతులు వీరే!

తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, నామినేషన్ సమయంలో అభ్యర్థులు అందించిన అఫిడవిట్ లను పరిశీలిస్తుంటే, కొందరి ఆస్తులను చూసి కళ్లు బైర్లు కమ్మకమానవు. పలువురి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులుండటమే
ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో అత్యధిక మొత్తం ఆస్తులున్న అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారు. రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను చూపిన వారి వివరాలు పరిశీలిస్తే

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) : రూ. 314,31,70,406

మర్రి జనార్దన్ రెడ్డి (టీఆర్ఎస్) : రూ. 161,27,26,168

కే అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్): రూ. 151,13,99,281

యోగానంద్ (బీజేపీ) రూ. 146,67,57,584

నామా నాగేశ్వరరావు (టీడీపీ) : 110,01,80,475

ఇక కుటుంబ ఆస్తుల వివరాలు రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వారిలో రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్ – నారాయణపేట), అమరేందర్ రెడ్డి (బీజేపీ – వనపర్తి), అమర్ సింగ్ (బీజేపీ – కార్వాన్), ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్ – పాలేరు), పొన్నాల
లక్ష్మయ్య (కాంగ్రెస్ – జనగాం), వి ఆనంద ప్రసాద్ (టీడీపీ – శేరిలింగంపల్లి), వీరేందర్ గౌడ్ (టీడీపీ – ఉప్పల్), కే దయాకర్ రెడ్డి (టీడీపీ – మక్తల్)లు ఉన్నారు.

Share This Post
0 0

Leave a Reply