తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్

KCR

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి. తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా .. సీఎం కేసీఆర్ ఆయ‌నకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను నియమించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన విష‌యం తెలిసిందే. గురువారం రాజ్‌భ‌వ‌న్‌లో కేసీఆర్ రెండ‌వ సారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో సీఎం కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా టీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు. దేశంలోనే అతిగొప్ప పార్టీగా టీఆర్‌ఎస్‌ను రూపొందించే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారు.

TAGS : trs working presedent , minister ktr , cm kcr , telangana ,

Share This Post
0 0

Leave a Reply