‘తెలంగాణ దేవుడు’ నుంచి ట్రైలర్ వచ్చేసింది.. ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్

శ్రీకాంత్ ప్రధాన పాత్రగా .. మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాణంలో .. హరీశ్ వధ్య దర్శకత్వంలో ‘తెలంగాణ దేవుడు’ రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ను ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఇది ఆయన బయోపిక్ అనే మాట వినిపిస్తోంది. ఆ విషయాన్ని ట్రైలర్లోని బతుకమ్మ పాట స్పష్టం చేస్తోంది.
ఈ సినిమాలో విజయ్ దేవ్ అనే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ కేసీఆర్ ను గుర్తుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని
వెనుకబాటుతనం .. తెలంగాణ విముక్తి కోసం జరిగే పోరాటం .. ప్రధాన పాత్రధారి అయిన శ్రీకాంత్ ఆ దిశగా కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి కావడం ఈ ట్రైలర్లో చూపించారు. ఈ
సినిమాలో ఆయన భార్య పాత్రలో ‘ఖడ్గం’ సంగీత కనిపిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్ .. బ్రహ్మానందం .. సాయాజీ షిండే .. తణికెళ్ల భరణి .. పోసాని కనిపిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share This Post
0 0

Leave a Reply