తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు

అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా జిల్లాల అదనపు సెషన్స్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి.

కాగా, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు విషయమై సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు గత ఆగస్టులో రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి హైకోర్టు లేఖ రాయడం జరిగింది.

Share This Post
0 0

Leave a Reply