తెలంగాణలో మరోసారి భారీగా పాజిటివ్ కేసుల వెల్లడి

కరోనా రక్కసి తెలంగాణలో ఉద్ధృతి కొనసాగిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,991కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 38 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారు కాగా, 12 మంది వలస కార్మికులు. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ లో 6, సూర్యాపేట జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, నారాయణపేట జిల్లాలో 1 కేసు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురు కరోనా బారినపడ్డారు. ఇవాళ ఓ మరణం సంభవించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది. అటు, ఇవాళ 120 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,284కి పెరిగింది. ప్రస్తుతం 650 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Share This Post
0 0

Leave a Reply