తుఫాను ప్రభావంతో గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్ష౦..

andhrafriends python

గ్రేటర్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, రాజేంద్రనగర్, పాతబస్తీ, శామీర్‌పేట, హకీంపేట తదితర ప్రాంతాల్లో గురువారం తేలికపాటి జల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో గ్రేటర్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష కురిసే అవకాశమున్నదని వెల్లడించారు.

TAGS : TELANGANA , HEAVY RAIN , HYDERABAD , TOOFAN ,

Share This Post
0 0

Leave a Reply