తాతయ్యను అందరూ వదిలేశారు… ఇకపై ప్రతియేటా నేనే చూసుకుంటా: ఎన్టీఆర్

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కళకళలాడాల్సిన ఎన్టీఆర్ ఘాట్, అలంకరణ లేక బోసిపోగా, దీన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు.

Share This Post
0 0

Leave a Reply