ఢిల్లీ నుంచి పిలుపు.. హుటాహుటిన బయల్దేరిన లక్ష్మణ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో… హుటాహుటిన ఆయన ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్మణ్ కలవనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే, లక్ష్మణ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీకి బయల్దేరే ముందు లక్ష్మణ్ ను టీజేఎస్ అధినేత కోదండరామ్, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కలిశారు. కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Share This Post
0 0

Leave a Reply