ఢిల్లీలో జగన్ గురించి ఇలా అనుకుంటున్నారు: పవన్ కల్యాణ్ సెటైర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 సీట్లతో వైసీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందించారని చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి, 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని దుయ్యబట్టారు. దీనికితోడు, ఢిల్లీలో జగన్ గురంచి ఇలా అనుకుంటున్నారంటూ ఓ కార్టూన్ ను షేర్ చేశారు. ఇందులో రెండు కాళ్లకు ఇసుక బస్తాలను కట్టుకుని… అతి కష్టంగా జగన్ ముందుకు నడుస్తున్నట్టు ఉంది.

Share This Post
0 0

Leave a Reply