ఠారెత్తిస్తున్న ఎండలు.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా నిజామాబాద్!

heat

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలతో పెరగడంతో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. శనివారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఇవి మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భద్రాచలం, మెదక్, ఆదిలాబాద్, రామగుండం, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం నిజామాబాద్ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత జిల్లాగా రికార్డులకెక్కింది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.

Share This Post
0 0

Leave a Reply