ట్యాంక్‌బండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నేతల అరెస్టులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఎంపీ సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును అరెస్ట్ చేశారు. ముదస్తుగా బీజేపీ నేత లక్ష్మణ్‌ హౌస్‌ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను ఇందిరాపార్క్‌ కూడలిలో అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్టు చేశారు. బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్‌ వైపు ఆందోళనకారులు దూసుకెళ్తున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో పలువురు కార్మికులు గాయపడ్డారు. అలాగే కార్మికులు కూడా పోలీసుల మీద రాళ్ళ దాడి చేయడంతో పరిస్థుతులు ఉద్రిక్తంగా మారాయి.

Share This Post
0 0

Leave a Reply